పూర్తి సమాచారం రాబట్టేందుకు… అమెరికా ప్రయత్నించాలి

కరోనా వైరస్ మూలాలపై చైనాను అమెరికా మరోసారి తప్పుపట్టింది. డబ్ల్యూహెచ్‍ఓ అధికారులను చైనా తప్పుదారి పట్టించిందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍నకు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన అధికారి జాన్ బోల్టన్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ తమ లేబొరేటరీ నుంచే పుట్టుకొచ్చిందా అని స్వయంగా వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అధిపతి ఆందోళన చెందారని పేర్కొన్నారు. కరోనా మూలాలపై చైనా నుంచి పూర్తి సమాచారం, సహకారం రాబట్టేందుకు అమెరికా ప్రయత్నించాలని అన్నారు. మహమ్మారి పుట్టుక, వ్యాప్తి నేపథ్యంలో చైనాలో ఎలాంటి ప్రభుత్వం ఉందని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో సగటు పౌరులందరికీ బోధపడిందన్నారు. తమ జీవాయుధాల కార్యక్రమం పట్ల చైనా గుట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు.