భారత విద్యార్థులకు రెండేళ్ల తర్వాత… చైనా గ్రీన్ సిగ్నల్
భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసే ప్రణాళికలను చైనా ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఇళ్ళల్లో చిక్కుబడిన వేలాది మంది విద్యార్థులకు బీజింగ్ ఆహ్వానం పలికింది. భారతీయ విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు. మీ సహనం విలువైనదని రుజువు చేస్తుంది. నేను నిజంగా మీ ఆనందాన్ని పంచుకోగలను. చైనాకు తిరిగి స్వాగతం అంటూ చైనాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల శాఖ కౌన్సెలర్ జీ రాంగ్ తెలిపారు. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, చైనాలో పనిచేస్తున్న కుటుంబాలకు వీసాలు ప్రారంభిస్తున్నట్లు న్యూఢల్లీిలోని చైనా రాయబార కార్యాలయం చేసిన వివరణాత్మక ప్రకటన చేశారు. విద్యార్థుల కోసం ఎక్స్`1 వీసా జారీ చేయబడుతుంది. మరొక విషయమేమంటే రెండు దేశాల మధ్య నేరుగా విమానాలు లేవు. భారతీయ వ్యాపారవేత్తలు, వారి కుటుంబాలను జులైలో చైనా అనుమతించింది.













