ప్రపంచ దేశాలకు తప్పిన ముప్పు…

హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ప్రయోగించిన రాకెట్ శకలాలు పడినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. చైనా ప్రయోగించిన లాంగ్‍మార్చ్ 5బి రాకెట్ ముప్పు భారత్‍కు తప్పింది. వారం రోజులుగా ఎక్కడ పడుతుందా అని ఉత్కంఠ పెంచినా చైనా రాకెట్ శకలాలు చివరకు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. బూవాతావరణంలోని రాగానే శకలాలు అధికభాగం మండిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమివైపు దూసుకొచ్చి సముద్రంలో 18 టన్నుల శకలాలు పడిపోయాయి. పశ్చిమ మాల్దీవుల సమీపంలోని సముద్రంలో కూలినట్లు నిర్ధారించారు. ఈ రాకెట్ శకలాలు సముద్రంలో కూలడం కంటే ముందే దగ్ధమైనట్లు గుర్తించారు.
గత నెల 29న చైనా ప్రయోగించిన ఈ లాంగ్ మార్చ్ 5బి అనే భారీ రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇక అప్పటినుంచి ఎక్కడపడుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందాయి. ఈ రాకెట్ భూవాతావరణంలోకి ప్రవేశించగానే శకలాలు పూర్తి బూడిద అయిపోతాయని, జనావాసాలపై పడే అవకాశాలు చాలాఆ తక్కువ ఉన్నట్లు ఇటీవలే శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే అమెరికా మిలటరీ మాత్రం ఆ శకలాలు తుర్కిమెనిస్తాన్‍లో భారత కాలమానం ప్రకారం అదివారం తెల్లవారు ఝామున 4:30 గంటలకు పడతాయాని చెప్పారు. అయితే చివరకు హిందూ మహాసముద్రంలో ఆ రాకెట్ శకలాలు పడిపోయాయి.