ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా… మనిషికి సోకిన

చైనాలో బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‍లలో ఒకటైన హెచ్10ఎన్3 తొలిసారి మనిషికి సోకింది. జియాంగ్‍సు ప్రావిన్స్ లో ఝెంజియాంగ్ నగరంలో ఉండే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‍హెచ్‍సీ) వెల్లడించింది. ఆ వ్యక్తి ఏప్రిల్ 28న జ్వరం, ఇతర లక్షణాలతో హాస్పిటల్‍లో చేరాడు. ఆ తర్వాత మే 28న అతనికి ఈ బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ సోకినట్లు తెలిపింది. అయితే అతనికి ఎలా ఆ వైరస్ సోకిందో మాత్రం ఎన్‍హెచ్‍సీ చెప్పలేదు. బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్‍లలో చాలా తక్కువ తీవ్రత ఉన్నది ఇదే. ఇది పెద్ద ఎత్తున మనుషులకు సోకే అవకాశాలు చాలా చాలా తక్కువని ఎన్‍హెచ్‍సీ తెలిపింది. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని చెప్పింది. అతని సన్నిహితులను కూడా పరీక్షించిని ఈ ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు. చైనాలో బర్డ్ఫ్లూకు చెందిన ఎన్నో స్ట్రెయిన్‍లు ఉన్నాయి. అత్యంత అరుదుగా ఇందులోని కొన్ని స్ట్రెయిన్‍లు మనుషులకు సోకుతున్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసే వాళ్లకు ఇది సోకుతోంది.