విదేశీ పర్యాటకులకు చైనా పచ్చజెండా
కొవిడ్ నుంచి ఈ మధ్యనే కోలుకున్న చైనా సుదీర్ఘ విరామం అనంతరం తొలిసారి తన సరిహద్దులను తెరవనుంది. విదేశీ పర్యాటకులకు మునుపటిలా దేశంలోకి అనుమతించనుంది. నేటి నుంచి అన్ని రకాల వీసాలనూ జారీ చేయనుంది. కరోనా కారణంగా దాదాపు మూడేళ్ల పాటు చైనా తన సరిహద్దులను మూసేసింది. కొవిడ్‌పై వజయం సాధించామని ఇటీవల ఆ దేశం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పర్యాటకులను నేటి నుంచి అనుమతిస్తామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. హాంగాంగ్, మకావు, హైనన్ ఐల్యాండ్లకు వీసాలు అవసరం లేకుండానే పర్యాటకులను గతంలో మాదిరిగా అనుమతించనున్నారు. 2020 మార్చి 28కు ముందు విదేశీయులకు జారీ చేసిన వీసాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు.













