భారతీయలపై వీసా ఆంక్షలు ఎత్తివేసినా చైనా
కొవిడ్ నేపథ్యంలో భారతీయులపై విధించిన వీసా నిషేధాన్ని చైనా ఎత్తేసింది. భారతీయ ప్రొఫెషనల్స్, వారి కుటుంబ సభ్యులకు వీసా మంజూరు ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు భారత్లోని చైనా రాయబార కార్యాలయం కొవిడ్ వీసా పాలసీ అప్డేట్ చేసింది. వీసా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. భారతీయులతో పాటు చైనీయుల కుటుంబ సభ్యులు, చైనాలో శాశ్వత నివాసం ఉన్న విదేశీయులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. చైనా కాలేజీలు, వర్సిటీల్లో తిరిగి చేరాలనుకునే భారత విద్యార్థుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుంటున్నది.













