అమెరికాలో దర్యాప్తుకు… చైనా డిమాండ్

అమెరికాలో 2019 డిసెంబర్ ప్రారంభంలోనే కరోనా కేసులు వెలుగు చూసినట్టు అక్కడి నేషనల్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ హెల్స్ (ఎస్‍ఐహెచ్) సంస్థ చేపట్టిన అధ్యయనంలో బయటపడటంతో కరోనా కథ కీలక మలుపు తిరిగింది. ఈ నివేదికను ప్రస్తావించిన చైనా శాస్త్రవేత్త ఒకరు కరోనా పుట్టకపై జరిగే తదుపరి దర్యాప్తును అమెరికాలోనూ చేపట్టాలని కోరారు. అమెరికా ఎన్‍ఐహెచ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. దేశంలో కరోనా తొలి కేసు రికార్డుల్లోకి ఎక్కువమునుపే ఐదు రాష్ట్రాల్లో కనీసం ఏడు కరోనా కేసులు నమోదైయ్యాయి. తొలి కేసు రికార్డులోకి నమోదవడానికి కొన్ని వారాల మునుపే అమెరికాలో కరోనా వ్యాప్తి ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఈ పరిమాణంపై చైనా అంటువ్యాధుల నిరోధక సంస్థ చీఫ్ జెంగ్ గువాంగ్ తాజాగా స్పందించారు. సంక్షోభం తొలినాళ్లలో అమెరికా కరోనా నిర్ధారణ పరీక్షలు తక్కువగా నిర్వహించిందని ఆయన తెలిపారు.