జపాన్ ప్రయాణాలపై ఆంక్షలు సడలించిన అగ్రరాజ్యం

జపాన్ ప్రయాణాలపై కఠిన నిబంధనలు అమలు చేసిన అగ్రరాజ్యం అమెరికా నిబంధనలను సడలించినట్లు ప్రకటించింది. మే నెలలో జపాన్‍లో కొత్త కరోనా వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదయ్యాయి. ఈ క్రమంలో జపాన్‍కు ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రజలకు అమెరికా సూచనలు చేసింది. అయితే కరోనా కారణంగా గతేడాది జరగాల్సిన టోక్కో ఒలిపింక్స్.. ఈ ఏడాది ఎలాగైనా నిర్వహించాలని నిర్ణయించుకున్న జపాన్ జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకూ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ టోర్నీ కోసం అమెరికన్లు జపాన్ వెళ్లడం కోసమే అమెరికా నిబంధనలను సడలించినట్లు సమాచారం.