సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించారు. బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించారు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు.













