భారతీయ విద్యార్థుల కోసం గ్రేట్ స్కాలర్ షిప్స్ 2024
భారతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వ గ్రేట్ బ్రిటన్ క్యాంపెయిన్‌తో కలిసి గ్రేట్ స్కాలర్షిప్ 2024 ను అందిస్తున్నట్లు బ్రిటిష్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ స్కాలర్షిప్స్తో విద్యార్థులు యూకేలో పలు విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఏడాది భారత విద్యార్థులకు 25 యూకే యూనివర్సిటీలు 26 పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రేట్ స్కాలర్షిప్లను ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్, సైకాలజీ, హ్యుమానిటీస్ తదితర విభాగాల్లో అందిస్తున్నాయి. ఈ స్కాలర్‌షిప్స్‌లో భాగంగా 2024-25 విద్యా సంవత్సరానికి 10 వేల పౌండ్లను ట్యూషన్ ఫీజుగా అందించనున్నారు. స్కాలర్షిప్స్ సమాచారం కోసం https://www.britishcouncil.in/studyuk/scholarships/greatscholarships చూడవచ్చు.













