యుద్ధంలో నష్టపోయిన గాజాకు.. అమెరికా తరపునా

యుద్ధంలో నష్టపోయిన గాజాకు అంతర్జాతీయంగా సహాయం లభించేలా అందరి మద్దతును కూడగడుతామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తెలిపారు. అమెరికా తరపునా ఆదుకుంటామని అన్నారు. అదే సమయంలో హమాస్ ఉగ్రవాదులకు ఎలాంటి సాయం లభించకుండా చూస్తామని తెలిపారు. గాజా విషయమై ఇజ్రాయెల్ సైన్యం-హమాస్ మధ్య 11 రోజుల పాటు జరిగిన యుద్ధం శాంతించింది. ప్రధాన సమస్యలపై ఎలాంటి రాజీ కుదరన్పటికీ, కాల్పుల విరమణకు ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్న బ్లింకెన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్యలు జరిపారు.