బిల్ గేట్స్.. తన పిల్లలకు ఎంత ఆస్తి ఇచ్చారో తెలుసా?

ప్రపంచంలోని అపర కుబేరుల్లో బిల్ గేట్స్ ఒకరు. ఆయన ఆస్తి విలువ రూ.8.7 లక్షల కోట్లకు పైమాటే. ఈ లెక్కన గేట్స్ దంపతుల విడాకుల అనంతరం పంపకాల్లో వారి ముగ్గురు బిడ్డలకు భారీగా ఆస్తి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ గేట్స్ తన పిల్లలు ఒక్కొక్కరికీ ఇస్తోంది ఎంతో తెలుసా? కేవలం రూ.73 కోట్లు మాత్రమే. గేట్స్ ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచానికి తన నిర్ణయం వింతగా ఉన్నా పిల్లల అర్ధం చేసుకున్నారని ఆయన ఇటీవల వివరణ ఇచ్చారు. తండ్రి కఠినంగా వ్యవహరించినా తల్లి మనసు ఊరుకోదు కదా. అందుకే గేట్స్ మాజీ భార్య మెలిండా మాత్రం బిడ్డలకు మరింత ఆస్తి అందేలా చూడాలని ప్రయత్నిస్తున్నారు.