బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు.. భారత్ కు ఇవ్వొదు

కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను భారత్‍తో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇవ్వకూడదంటూ మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు, కుబేరుడు బిల్ గేట్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను పంచుకోవడానికి వీలుగా మేధో సంపత్తి హక్కుల చట్టానికి మార్పులు చేయడం సాధ్యమవుతుందా అని అడిగిన ఒక ప్రశ్నకు..అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఫార్ములాను పంచుకోవడానికి ఆయన నిరాకరించారు. వ్యాక్సిన్లను అత్యంత జాగ్రత్తగా తయారు చేయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.