బిల్ గేట్స్ సంచలన ప్రకటన… భార్యకు

ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‍గేట్స్, ఆయన సతీమణీ మెలిందా నుంచి విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగానే కాకుండా, బిల్‍మెలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టిన దంపతులిద్దరూ విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం షాక్‍కు గురి చేసింది. ఎన్నో సమాలోచనల అనంతరం మా వివాహ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయానికి వచ్చాం. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, నిర్మాణాత్మకంగా ఎదిగేలా మా ఫౌండేషన్ ద్వారా కృషి చేశాం. ఈ మిషన్‍లో మా భాగస్వామ్యం ఎప్పటికీ కొనసాగుతుంది. కొత్త ప్రపంచంలోకి మేం వెళ్లేందుకు వీలుగా, మా వ్యక్తిగత ఆకాంక్షలను, మా విడాకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం బిల్‍గేట్స్, మెలిందా ట్విట్టర్ ద్వారా సంయుక్త ప్రకటనలో ప్రకటించారు.
మైక్రోసాఫ్ట్ ను స్థాపించిన బిల్‍గేట్స్ సీఈవోగా ఉన్న సమయంలో 1987లో మెలిందా ప్రొడక్ట్ మేనేజర్‍గా చేరారు. ఇద్దరూ తొలిసారిగా న్యూయార్క్ నగరంలో జరిగిన విందు కార్యక్రమంలో కలుసుకోగా ఆ తర్వాత 1 జనవరి 1994లో హవాయిలో వీరిద్దరి పెళ్లి జరిగింది. బిల్ గేట్స్ మెలిందా దంపతులకు జెన్నిఫర్ కాథరిన్ గేట్స్, రోరిజాన్ గేట్స్, ఫోబ్ అడిలె గేట్స్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో బిల్‍గేట్స్ ఒకరు.