బైడెన్ వ్యాఖ్యలను సమర్థించిన కాంగ్రెస్
జీ 20 సదస్సులో భాగంగా ప్రధాని మోదీతో భేటీ గురించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వియత్నాంలో మీడియాతో మాట్లాడారు. తమ చర్చలో మానవ హక్కులను గౌరవించడం, పత్రికా స్వేచ్ఛ, పౌర సమాజ పాత్ర వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయని అన్నారు. అదేవిధంగా సమ్మిళిత వృద్ధి, ఆహార భద్రత, విద్యను బలోపేతం చేయడం, స్థిరమైన అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం, వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం, ప్రపంచ ఆరోగ్యం వంటి అంశాలపై భేటీలో చర్చించినట్లు పేర్కొన్నారు. బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించింది. మోదీతో చర్చించిన విషయాలను బైడెన్ వియత్నాంలో చెప్పడంలో ఆశ్యర్యం ఏమీలేదు. ద్వైపాక్షిక సమావేశం అనంతరం వారిని ప్రశ్నలు అడిగేందుకు మీడియాకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని బైడెన్ బృందం పేర్కొంది. అందుకే ఆయన అక్కడ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఇలా కొనసాగుతోంది అని విమర్శించారు.













