రష్యాకు అమెరికా అధ్యక్షుడు.. వార్నింగ్
రష్యాకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. పుతిన్ బెదిరిస్తే తామేమీ భయపడేది లేదని ఆయన అన్నారు. ఉక్రెయిన్లోని నాలుగు కీలక ప్రాంతాలను రష్యాలో విలీనం చేసినట్లు పుతిన్ ప్రకటన చేసిన విషయం తెలిసిదే. ఆ ప్రాంతాలను కాపాడుకునేందుకు తాము ఆణ్వాయుధాలను కూడా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రాంతాలు ఎప్పటికీ రష్యాలోనే ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా కౌంటర్ ఇచ్చింది. పుతిన్ బెదిరింపులకు భయపడేది లేదని బైడెన్ అన్నారు. పుతిన్ బాధ్యతలేకుండా మాట్లాడుతున్నారని, బెదిరిస్తున్నారని బైడెన్ తెలిపారు. అమెరికా మిత్రదేశాలు పుతిన్ బెదిరింపులకు లొంగిపోవన్నారు. నాటో కూటమి దళాలతో కలిసి నాటో భూభాగం ప్రతి ఇంచును రక్షించుకునేందుకు అమెరికా సంసిద్ధమైందన్నారు.













