భారత్‍లో లాక్‍డౌన్ పెట్టాలి : ఫౌచీ

భారత్‍లో ఇవాళ కూడా 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో దేశంలో కరోనా సంక్షోభ తీవ్రతను చాటుతోంది. దీనిపై అమెరికా అంటువ్యాధుల నియంత్రణ నిపుణుడు డా.ఆంథోనీ ఫైచీ స్పందించారు. భారత్‍లో పరిస్థితి మరింత చేయిదాటకముందే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలో వెంటనే 3 నుండి 4 వారాలపాటు లాక్‍డౌన్ విధించాలని అన్నారు. వైరస్ సంక్రమణను బ్రేక్ చేయడానికి లాక్‍డౌన్ తప్పదన్నారు. లాక్‍డౌన్‍తో ఆర్థికవ్యవస్థ దెబ్బతింటుందనే ఆందోళన వద్దని అన్నారు. లాక్‍డౌన్ కారణంగా కలిగే ఆర్థిక నష్టం కంటే పెట్టకపోతే వచ్చే నష్టం ఇంకా పెద్దదన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని నష్టం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తాత్కాలిక హాస్పిటల్స్, కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. వీలైనంత ఎక్కువమంది వ్యాక్సిన్ ఇవ్వాలని, వ్యాక్సిన్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలని తెలిపారు. ఎక్కువ కంపెనీల్లో వ్యాక్సిన్‍ను ఉత్పత్తి చేయాలన్నారు. కష్టకాలంలో ఇతర దేశాలకు భారత్ అండగా నిలిచిందన్నారు. ప్రస్తుతం భారత్‍కు ప్రపంచదేశాలు మద్దతుగా నిలవాలన్నారు. వైద్య పరికరాలు అందించడమే కాదు వైద్య సిబ్బందిని కూడా పంపాలని కోరారు.