అమెరికాలో అన్నమయ్య జిల్లా వాసి మృతి
పట్టాలపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్యాసింజర్ రైలు ఢీ కొనడంతో అమెరికాలోని న్యూజెర్సీలో 39 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మరణించాడు. ఫిబ్రవరి 28న ప్రిన్స్టన్ జంక్షన్‌కు తూర్పున ఉన్న ట్రాక్‌లపై నడుస్తున్నప్పుడు వాషింగ్టన్ నుంచి బోస్టన్‌కు వెళ్తున్న ఆమ్ట్రాక్ రైలు పాదచారిని ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. న్యూజెర్సీలో ప్లెయిన్స్‌బోరోలో తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్న అతడ్ని ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన దిగాల శ్రీకాంత్ అని గుర్తించారు. ఈ ఘటనతో దాదాపు ఐదు గంటల పాటు రైళ్లు ఆగిపోయి పలువురు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. మృతి చెందిన శ్రీకాంత్‌కు భార్య, 10 ఏళ్ల కొడుకు, భారతదేశంలో వృద్ధ తల్లిదండ్రులు, అత్తమామలు ఉన్నారు.













