మూడు రోజులు కాదు.. ఒక రోజుకు పరిమితం : అమెరికా
ప్రయాణానికి ముందే రోజు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకున్న తరువాతే అమెరికా వెళ్లే విమానాన్ని ఎక్కాల్సి ఉంటుంది. టీకా వేయించుకున్నవారికీ, వేయించుకోని వారికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం అమెరికాకు బయలుదేరడానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుంటే సరిపోతుందన్న నిబంధన ఉండగా, దాన్ని ఒక రోజుకు పరిమితం చేయనున్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.













