అమెరికా వైపే మన విద్యార్థులు …
అమెరికా విదేశీ విద్యనభ్యసించేందుకు మన విద్యార్థులకు గమ్యస్థానంగా నిలుస్తున్నది. 2019-20 విద్యా సంవత్సరంలో అగ్రరాజ్యంలో దాదాపు 2 లక్షల మంది భారత విద్యార్థులు వివిధ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్నట్లు ఓపెన్ డోర్స్ నివేదిక వెల్లడించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ఈ నివేదికను వెలువరించింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారత్కు చెందినవారే దాదాపు 20 శాతం మంది ఉన్నారు. గత పదేండ్లలో అమెరికా విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య దాదాపు రెట్టింపయింది.













