భారత్ ను ఆదుకోవాల్సిన అవసరం … ఆంథోనీ ఫౌసీ
కరోనా వైరస్ విషయంలో భారత్ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు తాము ఏవిధంగానైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నిన్న ఆ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు భారత్లోనే నమోదయ్యాయి. భారత్లో క్లిష్ట పరిస్థితుల పరిష్కారానికి అమెరికాకు చెందిన సీడీసీ అక్కడి సంబంధిత విభాగంతో కలిసి సాంకేతికంగా సహకారం, సహాయాన్ని అందించేందుకు పనిచేస్తోంది. ఆ దేశంలో కొత్త వేరియంట్లు విజృంభిస్తున్నాయి. వాటిపై వ్యాక్సిన్లు ఎంతమేర ప్రభావం చూపిస్తాయనేది చెప్పలేం. కానీ ప్రజలందరికీ టీకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అని అన్నారు.













