ఈ విషయంలో చైనా తరవాతి స్థానం.. భారత్ దే
ఆసియాలో చైనా, భారత్, జపాన్ దేశాల్లో అత్యధిక క్యాన్సర్ కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, ఆ వ్యాధి వల్ల 9.3 లక్షల మరణాలు సంభవించాయనీ, ఈ విషయంలో చైనా తరవాతి స్థానం భారత్దేనిన తెలిసింది. 2019లో ఆసియా దేశాలలో మొత్తం 94 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 56 లక్షల మరణాలు సంభవించాయి. వాటిలో ఒక్క చైనాలో 48 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 27 లక్షల మరణాలు నమోదయ్యాయి. జపాన్లో 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు సంభవించాయి. భారతీయ శాస్త్రజ్ఞులతో సహా కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 1990 నుంచి 2019 వరకు 49 ఆసియా దేశాల్లో 29 రకాల క్యాన్సర్లను పరిశీలించారు. ఆసియాలో అత్యధిక క్యాన్సర్లు శ్వాసకోశం, ఊపిరితిత్తుల్లో సంభవిస్తున్నాయి. అధ్యయన కాలంలో ఈ వ్యాధి 13 లక్షల మందికి సోకగా, 12 లక్షల మంది మరణించారు.













