తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
తెలుగు సారస్వత సాంస్కృతి క సంఘం ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే సింగర్ సమీరా భరద్వాజ్ టీమ్ ఆధ్వర్యంలో లైవ్ concert నిర్వహిస్తున్నారు. నవంబర్ 7 వ తేదీన ‘‘ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా 143-09, హోలి ఎవెన్యూ, ఫ్లషింగ్, న్యూయార్క్ 11355 వేదికగా జరగనుంది.
ఇందులో భాగంగా సమీరా భరద్వాజ్, జుబల్, అక్షయ్, కార్తిక్ మల్యాల, షరన్, జయకార్ ఈ concert లో వున్నార. ఈ కార్యక్రమం నవంబర్ 7 న సాయంత్రం 3 గంటల నుంచి ఈ సంబరాలు ప్రారంభం అవుతున్నాయి. ప్రెసిడెంట్ సుమంత్ రామిసెట్టి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ సనిగేపల్లి, సెక్రెటరీ లావణ్య అట్లూరి, సునీల్ చల్లగుల్ల సహకారం అందిస్తున్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ : నవంబర్ 7
వేదిక : ‘‘ది హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా 143-09, హోలి ఎవెన్యూ, ఫ్లషింగ్, న్యూయార్క్ 11355
సమయం : మధ్యాహ్నం 3:00 గంటల నుంచి








