వైరస్ పుట్టుకపై 90 రోజుల్లో నివేదిక… ఇంటెలిజెన్స్ కు బైడెన్ ఆదేశం

కరోనా మూలాలపై మూడు నెలల్లో తేల్చాలని అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశించారు. చైనాలో మొదట ఉద్భవించిన వైరస్ జంతువుల నుంచి ఉద్భవించిందా? ప్రయోగాశాల ప్రమాదం నుంచి వచ్చిందా? అనే విషయంపై 90 రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని సూచించారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టుకు వచ్చిందని, జంతువుల నుంచి సోకిందని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా, ఈ మేరకు మరోసారి దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తుకు సహకరించాలని అమెరికా నేషనల్ ల్యాబోరేటరీస్‍కు బైడెన్ విజ్ఞప్తి చేశారు. వైరస్ మూలాలను కనుక్కునేందుకు చైనా సైతం కలిసిరావాలని కోరారు.