బైడెన్ సర్కార్ ఓ సంచలన ప్రకటన.. వ్యాక్సిన్ తీసుకుంటే

కరోనా జయించడంలో టీకా కీలక పాత్ర పోషిస్తోంది. కొన్ని దేశాల్లో టీకాలు వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రధానంగా అమెరికా ఈ సమస్య ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ సర్కార్ ఓ సంచలన ప్రకటన చేసింది. వ్యాక్సిన్ తీసుకుంటే, బీరుతో పాటు 200 డాలర్ల నగదు ఇస్తామని తెలిపింది. కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా ప్రజల్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వివరించారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రసన్నం చేసుకుంటున్నారు. బైడెన్ ప్రభుత్వం ఉబర్, లిఫ్ట్ రవాణా సంస్థలతో ఓ ఒప్పందం చేసుకుంది. కరోనా టీకా వేసుకోవడానికి వెళ్లే వారికి ఆ సంస్థ ఉచితంగా తీసుకెళ్లి, తీసుకొస్తుంది.
ఇలా ఒక్కో దేశం ఒక్కో ఆఫర్‍ను ప్రకటిస్తోంది. చికాగోలో టీకా వేయించుకుంటే కల్చరల్ పోగ్రాంకు ఉచితం ఎంట్రీ ప్రకటించింది. న్యూజెర్సీలో ఈ నెలలోపు టీకా వేసుకున్న 21 ఏళ్లు పైబడిన వారికి.. ఎంపిక చేసిన షాపుల్లో ఉచితంగా బీర్లు అందిస్తోంది. న్యూయార్క్లో 18 ఏళ్లు పైబడిన వారు టీకా వేసుకుంటే 20 డాలర్ల విలువైన లాటరీ టికెట్ ఉచితంగా ఇస్తోంది. లాటరి విలువ 50 లక్షల డాలర్లుగా ఉంది.