తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా…

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కూతురు శ్రేయ రెడ్డి, గన్‌మెన్ స్వామికి కూడా వైరస్ సోకినట్లు వెల్లడించారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడం వల్ల భూపాల్ రెడ్డి నారాయణఖేడ్‌లోని స్వగృహంలో స్వీయ నిర్భందంలో ఉన్నారు. ఇటీవల కాలంలో తనను కలిసి వారు నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్‌ల్లో ఉండాలని సూచించారు.