పోలవరం ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే, ఏపీ శాసనసభ గిరిజన కమిటీ చైర్మన్ తెల్లం బాలరాజు దంపతులు కరోనా బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న బాలరాజు, ఆయన కుటుంబసభ్యులు కరోనా పరీక్షలు చేయించుకోగా ఎమ్మెల్యే దంపతులతో పాటు వారి ఇద్దరు కుమారులకు, బాలరాజు తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరి బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో వైద్యలు పర్యవేక్షణలో హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్యం బాగానే ఉందని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని బాలరాజు తెలిపారు.






