మా టీకాకు అనుమతివ్వండి

భారత్‍లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‍ను ఉపయోగించడానికి అనుమతి కోరుతూ ఫైజర్ ఇండియా సంస్థ భారత ఔషధ నియంత్రణ సంస్థకు (డీసీజీఐ) దరఖాస్తు చేసుకున్నది. కరోనా టీకా వినియోగానికి సంబంధించి డీసీజీఐ నుంచి అనుమతి కోరిన మొట్టమొదటి ఫార్మా సంస్థ ఫైజరే. ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్‍లో అనుమతులు పొందిన ఫైజర్ భారత్‍లో కూడా తమ కొవిడ్ టీకా అమ్మకాలు, పంపిణీ హక్కులు పొందాలని భావిస్తున్నది. ఫైజర్ టీకా కొవిడ్ నుంచి 95 శాతం రక్షణ అందిస్తుందని ఆ సంస్థ పేర్కొన్నది.