అగ్రరాజ్యంలో రికార్డు స్థాయిలో కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల విజృంభించడంతో కొవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. క్రిస్మస్ సెలవుల సందర్భంగా జనం భారీగా గుమికూడడాలు, ప్రయాణాలు పెరగడంతో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తూ కొత్త రికార్డులు నెలకొల్పుతున్నది. గత వారం రోజుల్లో సగటున 2,67,000 కేసులు నమోదయినట్లు తెలిసింది. దీంతో ఆసుపత్రుల్లో రద్దీ పెరిగింది. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ సోకుతుండడం, అది కూడా చాలా వేగంగా విస్తరిస్తుండడంతో పరిస్థితి ఆందోళనకరంగా తయారైంది. దీనికి తోడు ఆంక్షలను సడలించడంతో ఇది మరింత విస్తరించే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.