లండన్ లో ప్రతి 10 మందిలో ఒకరికి!

కరోనా వైరస్ విజృంభణతో బ్రిటన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన దగ్గరి నుంచి రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 1,22,186 కేసులు నమోదయ్యాయి. బ్రిటన్ రాజధాని లండన్‌లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. డిసెంబర్ 16 నాటికి రాజధాని నగరంలో ప్రతి 20 మందిలో ఒకరు కొవిడ్ బారినపడి ఉండొచ్చని తెలిపింది. అలాగే అదివారం నాటికి ప్రతి పది మందిలో ఒకరు కొవిడ్ బారిన పడే అవకాశం ఉండొచ్చని వెల్లడిరచింది. ఒమిక్రాన్‌తో ఆసుపత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడిరచింది. అయితే అక్కడి వైద్యులు మాత్రం పూర్తిస్థాయి సమాచారం అందుబాటులో లేనందున పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలిపారు.