దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజులేనే లక్ష దాటిన

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడిరచింది. 15,13,377 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 1,17,100 మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వైరస్ ఉధృతిలో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74 శాతానికి చేరింది. మహారాష్ట్రలో 36,265 మంది కొవిడ్ బారిన పడ్డారు. ముంబాయిలో 20,181 కేసులు నమోదయ్యాయి. పశ్చిమబెంగాల్‌లో 15,421, ఢిల్లీలో 15,097 కేసులు నమోదయ్యాయి.
దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు ఏకంగా 15.34 శాతానికి పెరిగింది. దేశంలో మొత్తం కేసులు 3.52 కోట్లుగా ఉన్నాయి. దేశంలో ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం కేసుల సంఖ్య 3,007కి చేరింది. కొత్తగా 377 మందిలో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 876 మంది దీని బారినపడ్డారు. ఢిల్లీలో ఆ సంఖ్య 465కి చేరింది. మూడు వేల మందిలో 1,199 మంది కోలుకొని, ఇళ్లుకు చేరుకున్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వేరింయట్ వ్యాపించింది.