కొవిడ్ టీకా తీసుకున్న కేంద్ర మంత్రి

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా, మరోవైపు కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ పక్రియ కూడా అంతే వేగంగా సాగుతున్నది. జనం టీకాల కోసం వ్యాక్సినేషన్ సెంటర్ల దగ్గర బారులు తీరుతున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు కూడా టీకాలు తీసుకుంటున్నారు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కొవిడ్ టీకా రెండో డోసు కూడా వేసుకున్నారు. నాగ్‍పూర్‍లోని ఎయిమ్స్ ఆస్పత్రి వైద్యులు ఆయనకు టీకా వేశారు.