ప్రపంచానికి మరో ముప్పు…కొత్త వైరస్ కలకలం

కరోనాతో విలవిల్లాడుతున్న ప్రపంచాన్ని మరో ముప్పు భయపెడుతోంది. దక్షిణాఫిక్రాలో కొత్తరకం కరోనా వైరస్‌ను గుర్తించినట్టు చైనాలో వుహాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్ తో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని, ఈ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేస్తున్నారు. అయితే నియోకోవ్ వైరస్ కొత్తదేమీ కాదని, 2012, 2015లో పశ్చిమాసియాలో వ్యాపించిన మెర్స్ కోవ్‌తో దీనికి సంబంధం ఉందని తెలిపింది. దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో ఈ వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని ఇప్పటి వరకు మనుషులకు సోకలేదని వివరించింది. ప్రస్తుతం జంతువుల నుంచి జంతువులకు మాత్రమే వ్యాప్తి చెందుతుంది. జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని వుహాన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడిరచింది.