కరోనాను చంపే స్ప్రే… భారత్ లో

ముక్కు రంధ్రాల్లో కరోనాను చంపేసే నాజల్ స్ప్రేను భారత్ మార్కెట్‍లోకి తీసుకొచ్చేందుకు కెనడాకు చెందిన సానోటైజ్ సంస్థ రెడీ అవుతున్నది. తాము రూపొందించిన స్ప్రే సార్స్-కొవిడ్- 2ను ఎదుర్కోవటంలో 95 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని, ఊపిరితిత్తులకు వ్యాపించకుండా అడ్డుకొంటుందని వెల్లడించారు. భారత భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నామని సంస్థ సీఈవో, కో ఫౌండర్ ఆఫ్ సానోటైజ్ డాక్టర్ గిల్లీ రీగవ్ తెలిపారు. ఇప్పటికే యూకేలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందినీ స్ప్రే ఇజ్రాయెల్‍లో తయారవుతున్నదని తెలిపింది.