రెండో డోసు తీసుకున్న మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. మార్చి 11వ తేదీన మొదటి డోసును ఆయన తీసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా టీకాల కొరత ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందన్న మాట అవాస్తవమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు.