భారత్‍కు మరో వ్యాక్సిన్..

భారత్‍కు ఎంఆర్‍ఎన్‍ఎ కొవిడ్ వ్యాక్సిన్లను తీసుకురావాలనే యోచనలో ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ ప్రయత్నాలు సాగిస్తోంది. ప్రస్తుతం దాదాపు ఆరు కంపెనీలకు చెందిన ఎంఆర్‍ఎన్‍ఎ వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక కంపెనీతో కలసి పనిచేయాలనుకుంటున్నామని ఈ మేరకు భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నామని లుపిన్ ఎండీ నీలేష్ గుప్తా వెల్లడించారు. అయితే ఈ ఒప్పందం ఎప్పుడు కుదురుతుందో ఆయన చెప్పలేదు. ఎంఆర్‍ఎన్‍ఎ టెక్నాలజీతో వ్యాక్సిన్లు తయారు చేసే సంస్థల్లో ఫైజర్, మోడెర్నా ముందుకున్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒక సంస్థతో లుపిన్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. దిగుమతుల ద్వారా ఈ వ్యాక్సిన్లను తీసుకురావాలని లుపిన్ భావిస్తోంది.