కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం… విదేశాలకు వెళ్లేవారికి

టీకా వేయించుకున్నవారినే అనేక దేశాలు తమ దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారికి వాక్సినేషన్‍లో తొలి ప్రాధాన్యమివ్వనున్నట్టు ప్రకటించింది. అనేక దేశాలు వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయడంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. మరోవైపు కొవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో మరికొన్ని డిపార్ట్మెంట్లను చేర్చినట్లు తెలిపారు. పరీక్షల వాల్యుయేషన్‍కు హాజరయ్యే ఉపాధ్యాయులతో పాటు ఆహార- పౌరసరఫరాల శాఖ, పోస్టల్, సామాజిక న్యాయం, మహిళా, శిశు, సంక్షేమం, మత్స్యశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని చేర్చినట్టు వివరించారు. ఇప్పటి వరకు 32 విభాగాలు ఉండగా తాజాగా మరో 11 విభాగాలను చేర్చారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారిలో ప్రాధాన్యత గ్రూపులుగా గుర్తించిన వారికి మే 17న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఈ వయసు వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు.