ప్రపంచంలో మనమే టాప్ : కేంద్రం

ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఇండియానే టాప్‍లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో 89 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 97 లక్షల మంది ఫ్రంట్‍లైన్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా.. 60 ఏళ్లు దాటిన వాళ్లలో 3.63 కోట్ల మంది, 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో 2.36 కోట్ల మంది తొలి డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఇస్తున్న వ్యాక్సిన్ల సంఖ్యను తీసుకుంటే సగటున 34.4 లక్షల వ్యాక్సిన్లతో ఇండియానే తొలి స్థానంలో ఉన్నదని కూడా తెలిపింది. దేశంలోని మొత్తం వ్యాక్సిన్లలో 8 రాష్ట్రాలలోనే 60 శాతం ఇచ్చినట్లు చెప్పింది. గత 24 గంటల వ్యవధిలో 30 లక్షల మంది వ్యాక్సిన్ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.