ప్రపంచంలోనే ఇండియా రికార్డు
కరోనా వైరస్ రికవరీ రేసుల్లో ఇండియా రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అత్యధికంగా కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఇండియాలో నమోదు అయ్యింది. భారత్లో ఇప్పటి వరకు వైరస్ నుంచి 51 లక్షల మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 7 కోట్ల 30 లక్షల మందికి వైరస్ పరీక్షలు చేయించినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. గత వారం 77.8 లక్షల మందికి టెస్ట్లు చేశారు. రెండో సీరో సర్వే ప్రకారం దేశంలో చాలా మంది వైరస్ బారినపడే అవకాశాలు ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించిందని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. కోవిడ్ 19 మరణాల్లో (డెత్స్ పర్ మిలియన్) ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో తక్కువ ఉన్నట్లు రాజేశ్ చెప్పారు. 10 లక్షల జనాభాలో వైరస్ పరీక్షలు 50 వేల మందికి చేసినట్లు ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో మొత్తం 2.97 కోట్ల మందికి వైరల్ పరీక్షలు చేసినట్లు చెప్పారు.






