దేశంలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా…

భారత్‍లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,993 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 101 మంది మరణించారు. 10,307 మంది డిశ్చార్జి అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,77,387 కాగా, 1,06,78,048 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాల సంఖ్య 1,56,212కు చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,43,127గా ఉంది. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,07,15,204 మంది కొవిడ్ టీకాను తీసుకున్నారు.