24 గంటల్లో కొత్తగా 12,923 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,71,294కు పెరిగింది. తాజాగా మరో 11,764 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,73,372 మంది కోలుకున్నారు. కొత్త 108 మంది వైరస్ ప్రభావంతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,55,360కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,42,562 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ డ్రైవ్‍లో 70,17,114 మందికి కొవిడ్ టీకా వేసినట్లు చెప్పింది.