టీకా తయారీకి 5 లక్షల షార్కులు బలి?
కరోనా మహమ్మారికి టీకాను తయారు చేసేందుకు కనీసం 5 లక్షల షార్క్ చేపల్ని చంపే పరిస్థితి ఏర్పడవచ్చని షార్క్ అలీస్ అనే సంస్థ పేర్కొంది. కరోనా బారిన పడినవారు ఆ మహమ్మారి నుంచి బయట పడాలంటే వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి. వాణిజ్యపరమైన టీకాలను రోగనిరోధక ఏజెంట్ వంటి అనుబంధ టీకాలు అవసరం. నూనె రూపంలో ఉండే ఈ రోగనిరోధక ఏజెంట్ షార్క్ చేపల కాలేయంలో లభిస్తుంది.
దీంతో ప్రభావవంతమైన టీకాను తయారు చేయవచ్చు. అందువల్లే కరోనాకు టీకా తయారు చేయడానికి చాలా దేశాలు షార్క్ చేపల్ని విచ్చలవిడిగా వేటాడుతున్నాయి. చాలా జంతువుల్లో ఈ తరహా పదార్ధం ఉన్నప్పటికీ షార్క్ చేపలే ఎక్కువగా బలవుతున్నాయి. మొక్కల ద్వారా కూడా ఈ పదార్థాన్ని ఉత్పత్తి చేయవచ్చని, కాబట్టి షార్క్ చేపల్ని చంపడం బదులుగా మొక్కలతో ఈ పదార్థాన్ని ఉత్పత్తి చేయడంపై దృష్టి పెట్టాలని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు షార్క్ అలీస్ విజ్ఞప్తి చేస్తోంది.






