కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా… గూగుల్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని దాన్ని అదుపు చేసే బాధ్యత అందరిపై ఉందని గూగుల్ పేర్కొంది. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో గూగుల్ ప్రత్యేకమైన డూడుల్‍ను రూపొందించింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని తెలుపుతూ గూగుల్ రూపొందించిన ప్రత్యేక డూడుల్ అందర్నీ ఆకట్టుకుంటుంది. మాస్కులు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అని గూగుల్ క్యాప్షన్ ఇచ్చింది. కరోనా మహమ్మారి నివారణకు మాస్కులు ధరించడం తప్పనిసరి అని తెలిపింది. కరోనా నియంత్రణకు ఈ మూడింటిని తప్పనిసరిగా పాటించాలని కోరింది. 1. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. 2. తరచుగా చేతులను సబ్బుతో కడగాలి. 3. ఒకరికి ఒకరు భౌతిక దూరం పాటించాలి అని గూగుల్ తెలిపింది.