భారత్‌లో ఫోర్త్‌వేవ్ ?

భారత్‌లో జూన్ 22 నుంచి అక్టోబర్ 25 మధ్య కరోనా ఫోర్త్‌వేవ్ ఉండొచ్చని గత ఫిబ్రవరిలో కాన్పూర్ ఐఐటీ నిపుణుల అధ్యయనం పేర్కొంది. ఆగస్టులో తీవ్రస్థాయికి చేరుకుని తరువాత నెమ్మదిస్తుందని అంచనా వేసింది. గడిచిన మూడు నెలలు తరువాత ఇప్పుడు గరిష్టంగా ఆర్ వేల్యూ మార్క్ 1ని దాటడం గమనార్హం. అయితే అటు కేంద్రం గానీ, ఇటు అంటువ్యాధుల, వైద్యరంగ నిపుణులు గానీ ప్రస్తుతానికి నాలుగో తరంగం ముప్పులేదని, ఢిల్లీ లో సాధారణ కేసుల ఉధృతి తప్ప కొత్త వేరియంట్ కేసులు లేవని స్పష్టం చేస్తున్నారు. అయితే కేసుల పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రస్తుతం దేశంలో నమోదవుతున్న కేసులు కరోనా వేరియంట్‌లను పరిశీలిస్తే నాలుగో వేవ్ రాకపోవచ్చని కాన్పూర్ ఐఐటీకి చెందిన శాస్త్రవేత్త మణీంద్ర అగర్వాల్, తాజాగా అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయాన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెందిన శాస్త్రవేత్త, మాజీ అంటువ్యాధుల విభాగం కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవత్తే, మాజీ అంటువ్యాధుల విభాగం నిపుణుడు గంగాఖేడ్కర్ వ్యక్తం చేశారు. వ్యాక్సిన్లు తీసుకోనివారు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ విధిగా వాడాలని ఆయన సూచించారు.