వైరస్ మూలాలు కనుగొనకపోతే.. మరిన్ని విపత్తులు

కరోనా వైరస్ మూలాలను కనుగొనకపోతే అలాంటి మరిన్ని విపత్తులను ఎదుర్కోవలసి ఉంటుందని అమెరికాకు చెందిన ఇద్దరు వైద్య నిపుణులు హెచ్చరించారు. కరోనా మూలాలను కనుక్కొనేందుకు చైనా ప్రభుత్వ సహకారం ప్రస్తుతం అవసరమని చెప్పారు. కొవిడ్-19 మూలాలను తెలుసుకోలేకపోతే కొవిడ్-26, కొవిడ్ -32ను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని టెక్సాస్‍కు చెందిన పీటర్ హోటెజ్ వ్యాఖ్యానించారు. చైనాలో వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా వైరస్ బయటకొచ్చిందన్న వాదనను బలం చేకూర్చేందుకు చాలా సమాచారం ఉన్నదని ఫైజర్ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న స్కాట్ గొట్లీబ్ పేర్కొన్నారు.