మంత్రి ఈటల రాజేందర్ పేషీలో కరోనా
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేషీలో ఏడుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో ఇద్దరు డ్రైవర్లు, ముగ్గురు గన్మెన్లు, ఇద్దరు సహాయక సిబ్బంది ఉన్నారు. దీంతో మంత్రికి కూడా కొవిడ్ పరీక్షలు చేయగా, నెగెటివ్‌గా ఫలితం వెల్లడైనట్లు మంత్రి పేషీ వర్గాలు తెలిపాయి. మంత్రి చుట్టూ నిత్యం ఉండే సిబ్బంది కొవిడ్ బారినపడటంతో ఈటల బీఆర్కే భవన్‌కు రాలేదు. ఆయన ఇంటి వద్దనే ఉంటూ ఉదయం, సాయంత్రం వేళ్లల్లో సందర్శకులను కలిసినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. వైద్య మంత్రి పేషీలో కరోనా పాజిటివ్‌లు నిర్ధారణ కావడంతో, ఈటల కార్యాలయాన్ని క్రిమిసంహారక నాశన ద్రావణంతో శానిటైజ్ చేశారు.






