డెల్టా వేరియంట్ తో అమెరికాకు.. పెను ముప్పు

ఇండియాలో తొలిసారి కనిపించిన కరోనా డెల్టా వేరియంట్‍తో అమెరికాకు పెను ముప్పు పొంచి ఉందని అన్నారు అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాను అమెరికా నుంచి పూర్తిగా పారదోలాలని అనుకుంటున్న తమకు ఇది సవాలేనని అన్నారు. ఈ డెల్టా వేరియంట్ వల్ల నిస్సంందేహంగా వ్యాప్తి చాలా ఎక్కువగా ఉన్నదని స్పష్టం చేశారు. పైగా వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఇస్తున్న అన్ని వ్యాక్సిన్లు ఈ వేరియంట్‍ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఫౌచీ వెల్లడించారు. దీనిని ఎదుర్కొంనేందుకు మా దగ్గర సాధనాలు ఉన్నాయి. వాటితో దీని వ్యాప్తిని అరికడతామని అన్నారు. జులై 4 నాటికి 70 శాతం మంది వయోజనులకు టీకాలు వేయాలనే లక్ష్యాన్ని చేరేందుకు అమెరికాకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఈ విషయాన్ని శ్వేతసౌధ సీనియర్ సలహాదారు జెఫ్రే జీంట్స్ వెల్లడించారు. ఇప్పటి వరకూ అమెరికాలో 45 శాతం అంటే 15 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది.