అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు కరోనా

అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్(68)కు కరోనా సోకింది. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. తనకు స్వల్పంగా లక్షణాలు కనిపిస్తున్నాయని, రాబోయే ఐదు రోజులు క్వారంటైన్‌లో వుంటానని తెలిపారు. గత వారం రోజుల్లో తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. తన సిబ్బంది వారి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు.