ఆ గ్రూప్ రక్తం ఉన్న వారికి.. కరోనా ముప్పు

పీచు పదార్థం సమృద్ధిగా ఉండే శాకాహారం తినేవారిలో కరోనాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అధికంగా ఉన్నట్లు గుర్తించామని సీఎస్ ఐఆర్ ప్యాన్ ఇండియా సర్వే తెలిపింది. ఇలాంటి టైమ్‍లో అసలు ఎవరికి ఇది ఎక్కువ రిస్క్ అని సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 140 మంది డాక్టర్లు, సైంటిస్టులు సీఎస్‍ఐఆర్ ల్యాబ్‍ల్లో పనిచేసే 10,427 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లోని ప్రతిరక్షకాల తీరును పరిశీలించారు. బీ, ఏబీ గ్రూప్ రక్తం ఉన్నవారిలో సెరో పాజిటివిటీ అధికంగా ఉంటుందని, వారికి కరోనా రిస్క్ చాలా ఎక్కువని పరిశోధకులు తేల్చారు. ఓ గ్రూప్ రక్తం ఉన్నవారికి ఈ వైరస్ వల్ల పెద్దగా ముప్పేమి ఉండదని అంటున్నారు. అంతేకాకుండా సిగరెట్ తాగేవారి గొంతులో జిగురు పొర ఏర్పడుతుందని, ఇది వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటుందని పేర్కొన్నారు.