కొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతి : అమెరికా

కొవిడ్ టీకా పూర్తి స్థాయిలో పొందిన విమాన ప్రయాణికులను నవంబరు నుంచి తమ దేశంలోకి అనుమతించాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిబంధనలను లోబడి భారత్ సహా 33 దేశాల వారు తమ దేశంలోకి ప్రవేశించవచ్చని తెలిపింది. మన దేశంలో తయారైన టీకాల్లో కొవిషీల్డ్ తీసుకున్నవారికే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఏటీకా ఆమోద యోగ్యమో తుది నిర్ణయం తీసుకొనేది తమ దేశ వ్యాధుల నియంత్రణ కేంద్రం (సీడీసీ) మాత్రమేనని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటి వరకు మోడెర్నా, ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా, కొవిషీల్డ్, సినోవాక్ తదితర ఏడు టీకాలను మాత్రమే గుర్తించింది. భారత్ బయోటెక్ అభివృద్ధిపర్చిన కొవాగ్జిన్ టీకాకు ఈ నెలలో డబ్యుహెచ్‌వో అనుమతించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, కొవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచామని, వచ్చే నెలలో సుమారు 22 కోట్ల డోసులు కొవిషీల్డ్ వ్యాక్సిన్ అందచేస్తామని కేంద్ర ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్ తెలియచేసింది.